పాల్గొన్న మహబూబ్ నగర్ ఎమ్మెల్సి నవీన్ రెడ్డి,ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి
హాజరైన బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జి సతీష్
( పయనించే సూర్యుడు అక్టోబర్ 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో సోమాజిగూడ డివిజన్ లో మాగంటి సునీతమ్మ ను గెలిపించు కోవటానికి సామాజిక మాధ్యమాలలో నిర్వహించాల్సిన ప్రచార అంశాలపై దివంగత నేత మాగంటి గోపీనాథ్ క్యాంప్ ఆఫీస్ శ్రీనగర్ కాలనిలో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశం లో ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సి నవీన్ రెడ్డి,ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జి సతీష్,న్యాయవాది దీప్తి, భూత్ ఇంచార్జిలు,సోషల్ మీడియా ఆర్గనైసర్స్,స్థానిక నాయకులుతదితరులు పాల్గొన్నారు.