
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
ఈరోజు శుక్రవారం రోజున భారత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.అదేవిధంగా గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వ్యక్తుల్లో మహాత్మా గాంధీ కీలకపాత్ర పోషించారని,శాంతి,అహింస అనే మార్గం పై బ్రిటిష్ వారిని గడగడలడించిన వ్యక్తి అని,స్వతంత్రం వచ్చిన తర్వాత 1948 లో కొందరు దుష్టశక్తులు గాంధీ ని హత్య చేయడం జరిగిందనీ,మతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసి ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది అని నమ్మిన వ్యక్తి గాంధీ అని అన్నారు. ఈ రోజు దేశం అభివృద్ధి చెందింది అంటే ఆది గాంధీ చూపిన శాంతి మార్గం వల్లనే అని,దేశ ప్రజలు మతాలకు అతీతంగా కలిసి ఉండి గాంధీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. 2004లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యూపీఏ చైర్ పర్సన్ గా సోనియా గాంధీ , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా రాజశేఖర్ రెడ్డి తెలంగాణలో పర్యటించినప్పుడు చాలామంది వలసలు వెళుతున్నారని వలసలను ఆపడానికి వంద రోజులు ఉపాధి హామీ పనిని ప్రారంభించడం జరిగిందని, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందనీ, దీనికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అని పేరు పెట్టారని 100 రోజుల పనిని సంవత్సరంలో ఎప్పుడైనా గ్రామ సభలో సర్పంచ్ సమక్షంలో 100 రోజులలో ఎప్పుడు ఏ పని చేయాలి అని గ్రామ ప్రజలే నిర్ణయించుకునే స్వేచ్ఛను అందించడం జరిగిందని, ప్రస్తుతం బిజెపి గాంధీ పేరు వింటేనే భయపడుతూ గాంధీ పేరూను మార్చాలనే కుట్రతో ఉపాధి హామీ పని పేరును మారుస్తూ జీ రామ్ జీ అని పెట్టడం జరిగిందని, అదేవిధంగా పని దినాలను 125 రోజులకు పెంచడం జరిగిందని చెప్తున్నారని అందులో 70 రోజులు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అని మిగతా 50 రోజులు రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని బిజెపి చెప్తుందని దీనివల్ల అన్ని రాష్ట్రాలపై అధిక భారం పడుతుంది అని, దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ పని యొక్క 100 రోజుల భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించింది అని నగేష్ రెడ్డి తెలియజేశారు. అదేవిధంగా బిజెపి ప్రభుత్వం కూడా ఉపాధి హామీ పనిలోని పూర్తి పని దినాల భారాన్ని భరించాలని, గాంధీ పేరును పాత పద్ధతిలోనే యధా విధంగా కొనసాగించాలని, రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలలో సర్పంచులు, రాష్ట్ర ప్రభుత్వం కూడా తీర్మానం చేయడం జరిగిందని దేశ ప్రజలందరూ బిజెపి చేస్తున్న పుట్టలను గమనిస్తున్నారని, బిజెపి తమకు బలం ఉంది అని అనుకుంటున్నారని రాబోయే 2029 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, రాహుల్ గాంధీ ప్రధానిగా మళ్లీ ఉపాధి హామీ పనిని మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అని మారుస్తామని ఉపాధి హామీ పని ని కొనసాగిస్తామని నగేష్ రెడ్డి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్,మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,యూత్ కాంగ్రెస్ నాయకులు గణరాజ్,నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, డిచ్పల్లి సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు వాసు,నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు వినయ్,నగర మైనారిటీ అధ్యక్షులు ఎజాస్, మార్కెట్ కమిటీ సభ్యులు ఈసా,స్వప్న,బంటు బలరాం,సలీం, నూర్, అయ్యుబ్ మరియు తదితరులు పాల్గొన్నారు