
హర్షం వ్యక్తం చేసిన బిజెపి సీనియర్ నాయకులు గొల్ల కోటి, గ్రంధి,
పయ నించే సూర్యుడు, జనవరి 20, 2026: ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారతీయ జనతా పార్టీ జాతీయ
అధ్యక్షుడిగా నితిన్ నబిన్ (45) ఎన్నికైన సందర్భంగా ముమ్మిడివరం మార్కెటింగ్ యాడ్ వైస్ చైర్మన్ గొల్ల కోటి వెంకటరెడ్డి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ హర్షం వ్యక్తం చేసారు. సోమవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కమల దళపతిగా నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, జేపీ నడ్డా వారసుడిగా బీహార్ నేతకు అవకాశం దక్కిందని, చిన్న వయసులో అధ్యక్ష స్థాయికి ఎదిగిన ఘనత ఆయనకే దక్కిందని, 5సార్లు ఎమ్మెల్యేగా సేవ చేసిన నితిన్ నబిన్ పార్టీలో పనిచేసిన నాయకత్వ అనుభవం, పార్టీ వ్యవస్థలో చురుకైన పాత్ర భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసి దేశం గర్వించదగ్గేలా పార్టీని ముందుకు నడిపించాలని ఆశాభావం వ్యక్తం చేసారు.
