
జనం న్యూస్ జనవరి 27 అమలాపురం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
అమలాపురం లో ఉన్న జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గౌరవించాలని అన్నారు. దేశం కోసం ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగం చేశారని, వారందరినీ స్మరించుకోవలసిన అవసరం ఉందని అన్నారు. భారత రాజ్యాంగాన్ని ప్రతీ ఒక్కరూ గౌరవించాలని అన్నారు. అనంతరం స్వీట్లు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు అయ్యల భాషా, బీజేపీ నాయకులు ఇళ్ల సత్యనారాయణ, ఆకుమర్తి బేబీ రాణి, చిట్టూరి రాజేశ్వరి, డీవీఎస్ రాజు, బండి శ్రీను, దాకే వెంకటరావు, జంగా రాజేంద్రకుమార్, మోకా ఆదిలక్ష్మి,పోలమూరి వెంకట్, సంసాని రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.