పయనించే సూర్యుడు ( న్యూస్) జనవరి11( రిపోర్టర్ సి తిమ్మప్ప) మక్తల్
బీజేపీ పార్టీ మక్తల్ టౌన్ అధ్యక్షుడు గా ఎన్నికైన బాయికటి రాజశేఖర్ రెడ్డి ని బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షుడు జుట్ల శంకర్ ,బి ఆర్ ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు జుట్ల చిన్న హన్మంత్ ,DHG పొలప్ప , సారాయి హన్మంత్ ,జగ్గలి తాయప్ప,ఏలిగాండ్ల బాలప్ప ఆత్మీయంగా సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి రిజర్వేషన్లు SC ఉపకులలు కు సమాన వాటా ఇచ్చి సమన్యాయం చేయడానికి న్యాయ పరమైన చిక్కులు తొలగించడాని గుర్తు చేసి రాష్ట్రాలకు విస్తృత అధికారాలు ఇవ్వడం లో పార్టీ కృషిని హర్షించారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యల పరిస్కారం కు కృషి చేయాలని కాంక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చి తక్షణమే SC రిజర్వేషన్లు అమలు చేసే విదంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా బాయికటి రాజశేఖర్ రెడ్డి ని ఆత్మీయ సన్మానం లో పాల్గొన్న వారిలో బీ సి సంఘాల సీనియర్ నాయకులు సారాయి హన్మంత్ అంబేద్కర్ యువజన సంఘం సీనియర్ నాయకులు DHG పొలప్ప గారు, మేస్ట్రీ సంఘం నాయకులు జగ్గలి తాయప్ప,ఏలిగాండ్ల బాలప్ప,ప్రసాద్ , జుట్ల రమేష్,నవీన్ తదితరులు బాయికటి రాజశేఖర్ రెడ్డి కు హర్దిక శుభాకాంక్షలు తెలియజేశారు.