పయనించే సూర్యుడు జనవరి 29హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి
జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది అనంతరం బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ నిన్న జమ్మికుంట యూత్ కాంగ్రెస్ నాయకులు బండి సంజయ్ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది దీన్ని వ్యతిరేకిస్తూ జమ్మికుంట బీజేవైఎం ఆధ్వర్యంలో బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. బీజేవైఎం కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి మాట్లాడుతూ అన్నం ప్రవీణ్ బండి సంజయ్ అన్న ని విమర్శలు చేసే స్థాయి నీది కాదు అని ఇలాంటి చిల్లర వేషాలు మానుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కాంగ్రెస్ నాయకులను అడ్డుకుంటాం అని హెచ్చరించారు.
బీజేవైఎం జమ్మికుంట టౌన్ ప్రెసిడెంట్ ప్రశాంత్ మాట్లాడుతూ అస్సలు ఉద్యమ కారుడైన గద్దర్ మీద కేసులు పెట్టిన వారు మీరు కదా 2005 లో కాంగ్రెస్ హయాంలో గద్దర్ మీద కేసులు పెట్టింది మీ కాంగ్రెస్ పార్టీ కదా 30 సంవత్సరాల నుండి దళిత జాతి అభ్యుదయం గురించి కొట్లాడే మంద కృష్ణ మాదిగ కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డు ప్రకటించడం మాకు ఎంతో హర్షణీయం అని అన్నారు.
మీరు ఏదైతే ఉద్యమ కారులకు అన్యాయం అని మీరు అంటున్నారో తెలంగాణ ఉద్యమ సమయంలో వారిని ఎక్కడి అక్కడికి అణిచి వేసింది మీరు కదా అని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా రావడం లేదు అని అనడం కాదు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం శ్వేతా పత్రం విడుదల చేసే దమ్ము ఉంద అని ప్రశ్నించారు ఉంటే శ్వేతా విడుదల చేసి తరువాత మీరు మాట్లాడితే బాగుంటుంది అని హితవు పలికారు. కార్పొరేటర్ స్థాయి నుండి ఎంపీ గా రాష్ట్ర అధ్యక్షునిగా జాతీయ ప్రధాన కార్యదర్శి గా కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బండి సంజయ్ మిద అనుచిత వాక్యాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు బురుగుపల్లి రాము ,బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి నవీన్, ఉపాధ్యక్షుడు శ్రీవర్తి అఖిల్,బీజేవైఎం నాయకులు పసునూటి శివనగరాజు,శ్రీవర్తి ప్రవీణ్,సిరియాల విజయ్,పాచిమట్లా శ్రీకాంత్, గణేష్, మనోజ్,సాయి, అజయ్,రోశన్, వెంకటేష్,సుమన్.సాయి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.