
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో : సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల.*తెలంగాణ ప్రభుత్వం బీడీ కార్మికులకు జీవన భృతి కొత్తవారికి కల్పించడాన్నీ తిరస్కరించిన దానిని వ్యతిరేకిస్తూ ఆగస్టు 25 తేదీ నాడు ఖానాపూర్ పట్టణంలో ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నాను తెలంగాణ బీడీ అండ్ షిగార్ వర్కర్స్ యూనియన్ టి ఐ టి యు ఆధ్వర్యంలో నిర్వహించనున్నాం.ఈ సందర్భంగా ఈరోజు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఖానాపూర్ లో కరపత్రాలను విడుదల చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఖానాపూర్ మండల కన్వీనర్ మహమ్మద్ రియాసత్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు డాకూర్ తిరుపతి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి నాగేల్లి నర్సయ్య,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మండల కార్యదర్శి సుంచుల నారాయణ ,మండల అధ్యక్షులు పానగంటి నరేష్ కుమార్,మండల ఉపాధ్యక్షులు నాగుల నర్సా గౌడ్ లు పాల్గొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రజలకు కార్మికులకు అనేక హామీలు ఇచ్చింది.బీడీ కార్మికులకు ఆంక్షలు లేకుండా జీవన భృతి కల్పిస్తామని హామీ ఇచ్చారు.నేడు ఆ హామినీ మరిచి చేతులెత్తేశారు . చేయూత పథకంలో దరఖాస్తులు తీసుకుంటున్నట్టు గానే బీడీ కార్మికుల దరఖాస్తులను తీసుకొని బీడీలు చూడుతున్న ప్రతి కార్మికులకు జీవన భృతి కల్పించాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీని 2016 నుండి 4000 రూపాయలు పెంచుతామన్న దానిని అమలు చేయాలని, బీడీ కార్మికులకు కనీస పెన్షన్ 6000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తూ జరిగే ధర్నాను జయప్రదం చేయాలని బీడీ కార్మికులకు పిలుపునివ్వడం జరిగింది .