జనం న్యూస్ జూలై 21 జగిత్యాల
జిల్లా బీరుపూర్ మండల పరిధిలోని గ్రామాల యువత మండల పోలీసు స్టేషన్ అధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారి ఆదేశాల మేరకు గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన కార్యక్రమంలో భాగంగా మండల స్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ను సోమవారం బీర్పూర్ పోలీసు వారు నిర్వహించారు. మండలంలోని గ్రామాల నుండి 8 టీం లను సెలెక్ట్ చేసి వారికి పోటీలను నిర్వహించి అందులోని బెస్ట్ టీం ను సర్కిల్ లెవెల్ పోటీలకు పంపడం జరిగిందని బీర్పూర్ ఎస్సై రాజు తెలిపారు. మండల స్థాయిలో మొదటి విజేతగా బీర్పూర్ టీం మరియు రెండో విజేతగా తుంగూరు టీం నిలువగా వారికి మెడల్స్ మరియు జ్ఞాపికలు అందజేశారు.ఈ పోటీల నిర్వహణకు సహకరించిన పి ఈ టి లు లక్ష్మణ్, మహేందర్ , జీవన్ లను బీరు పూర్ ఎస్సై రాజు అభినందించారు.