
"బీఎస్పీ దుబ్బాక నియోజవర్గం అధ్యక్షులు సుద్దాల రాజు"
(పయనించే సూర్యుడు అక్టోబర్ 28 రాజేష్)
ఈరోజు దుబ్బాక నియోజకవర్గం పరిధిలో బిఎస్పి ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వాల్పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. నవంబరు 1 న హైదరాబాదులో పార్కు వద్ద జరిగే బీసీలకు 42% రిజర్వేషన్లపై జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాలని వారు కోరారు . జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచే ప్రక్రియ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు విఫలమయ్యాయి. అని వారు పేర్కొన్నారు. బీసీలు అందరూ ఏకమై కేంద్రాల రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు కోరారు. బీఎస్పీ ద్వారానే బహుజనులకు రాజాధికారం సామాజిక న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు దుబ్బాక నియోజకవర్గం ఉపాధ్యక్షులు బండ నర్సింలు. దుబ్బాక ఇన్చార్జిలు. మ్యాదరి నర్సింలు. మోతే నర్సింలు. రుద్రారం ప్రశాంత్. బాబు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.