పయనించే సూర్యుడు జనవరి29 మంచిర్యాల్ జిల్లా మంచిర్యాల్ మండల్ రిపోర్టర్ (గొడుగు ఆశీర్ విల్సన్)
ఈనెల 30 తేదీ నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బీసీల సంక్షేమానికి రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితిగా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి బడ్జెట్ సమావేశాలలో 35 లక్షల కోట్ల నుండి 40 లక్షల కోట్ల వరకు బడ్జెట్ ప్రవేశపెడితే బీసీలకు కేటాయించేది 15 నుండి 16 వేల కోట్లు మాత్రమే దేశంలో ఉన్న 85 కోట్ల మంది బీసీలకు బిస్కెట్లకు కూడా సరిపోవు. ఇక బీసీల ఆర్థిక ఆర్థిక అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది. ప్రభుత్వానికి అత్యధిక పనులు కట్టేది బీసీ సమాజం ప్రభుత్వ ఖజానాలో సగభాగం బీసీ సమాజం కడుతున్న పన్నులే అయితే బీసీ సమాజానికి కేటాయించేది అరకొర నిధులు మాత్రమే ఇది బీసీలపై వివక్షగా భావిస్తున్నాం. ఇప్పటికైనా బీసీ జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం
ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి అకాల రమేష్ జిల్లా కార్యదర్శి శాఖ పురి భీమ్సేన్ నాయకులు భూమేష్ తదితరులు పాల్గొన్నారు