
పాల్గొన్న బీసీ జనసేన జాతీయ అధ్యక్షులు కత్తి చంద్రశేఖర్ అప్ప
( లోకల్ గైడ్ షాద్ నగర్)
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం లో బీసీ జనసేన జాతీయ అధ్యక్షులు కత్తి చంద్రశేఖర్ అప్ప అధ్యర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలను శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జనసేన సభ్యులు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జాతీయ బీసీ జనసేన అధ్యక్షులు కత్తి చంద్రశేఖర్ అప్ప మాట్లాడుతూ అణగారిన వర్గాల విద్యా సాధికారత కోసం, సామాజిక సమానత్వం కోసం ఫూలే చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. కుల వివక్ష లేని సమాజాన్ని నిర్మించడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.ఆయన ఆశయాలను కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో బీసీ జనసేన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మేకల వెంకటేష్, జిల్లా అధికార ప్రతినిధి శ్రవంతి రాజ్, నియోజకవర్గం అధ్యక్షురాలు జక్కుల జలజ, నియోజకవర్గం అధ్యక్షులు గడ్డమిది రమేష్, రాములు, వెంకటయ్య టీచర్, షాద్ నగర్ పట్టణ అధ్యక్షురాలు బేబితదితరులు పాల్గొన్నారు.