పయనించే సూర్యుడు ఫిబ్రవరి 1 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల కొరకై మండల పరిధిలోని బీసీ వర్గాల వారు అర్హులైన 20 సంవత్సరముల నుండి 60 సంవత్సరముల లోపు వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ వర్గాల వారు ఆర్థికంగా నిలదొక్కు కోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అర్హత కలిగిన బీసీ కులాల వారందరూ దరఖాస్తు చేసుకోవాలని మండల కన్వీనర్ గొర్తి రుద్రమ నాయుడు ఓ ప్రకటనలో తెలియజేశారు