షాద్ నగర్ అసెంబ్లీ అధ్యక్షులుగా చంద్ర శేఖరప్ప ఎన్నిక
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 21 షాద్ నగర్ నియజకవర్గం ఇన్చార్జి మెగావత్ నరేందర్ నాయక్) షాద్ నగర్ పట్టణంలో ఈరోజు దేవిగ్రాండ్ లో బీసీ సేన రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బీసీ సేన నూతన కమిటీ ఎన్నికల సమావేశం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణ హాజరై షాద్ నగర్ అసెంబ్లీ అధ్యక్షులుగా శేఖరప్ప ని ఎన్నిక చేయడం జరిగింది ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, బీసీ సమాజ అభివృద్ధి, హక్కుల సాధన, రాజకీయ ప్రాధాన్యత పెంపు తదితర అంశాలపై విశ్లేషణాత్మకంగా చర్చించారు. బీసీల ఐక్యతకు, సామాజిక న్యాయ సాధనకు బీసీ సేన అహర్నిశలు శ్రమిస్తోందని ఆయన అన్నారు.నూతన కమిటీ సభ్యులను అభినందిస్తూ, బీసీ హక్కుల కోసం ఆగకుండా పోరాడాలని, సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీసీ యువత రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు రావడానికి బీసీ సేన నిరంతర పోరాటం సాగిస్తుందని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో బీసీ సేన నేతలు,ప్రముఖులు అందే బాబయ్య,సత్యం,లక్ష్మణ్ డా,,రాజు ఆర్ ఎం పీ సంఘం ప్రెసిడెంట్, చందూలాల్, ఎస్ శంకరయ్య,జగదీష్ గౌడ్,మల్లేష్ గౌడ్,శివ కుమార్ ముదిరాజ్, ఎం రవి, రాఘవేంద్ర,రమేష్,వరప్రసాద్,చందు,సత్యం, హరీష్ కుమార్, నరేష్,రమేష్,సాయి కుమార్,కాట్న రాజేష్ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.