

పయనించే సూర్యుడు తేదీ 01 నవంబర్ శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న.
ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు నిన్న ఎర్రవల్లి మండలం ధర్మవరం గ్రామంలో బీసీ ప్రభుత్వ బాలురు హాస్టల్‌లో కలుషిత ఆహారం తీసుకొని విద్యార్థులు అస్వస్థతకు గురై,ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని,విద్యార్థులను పరామర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తో మాట్లాడి,విద్యార్థుల ఆరోగ్య యోగక్షేమాలను అడిగి తెలుసుకొని విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.విద్యార్థులకు ఫుట్ పాయిజన్ పై పూర్తి స్థాయి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గంజిపేట రాజు,శేఖర్ నాయుడు,శ్రీరాములు,అంజి,గంగాధర్,రామ్మోహన్ యాదవ్,చిన్న యాదవ్,రాజు,వీరేష్ మరియు తదితరులు పాల్గొన్నారు…..
