కీర్తిశేషులు ఎండి రీయాజ్ జ్ఞాపకార్థం టోర్నమెంట్ నిర్వహణ
భారీగా పాల్గొంటున్న క్రికెట్ జట్లు
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 25 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం బూర్గుల గ్రామంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభించారు. కీర్తిశేషులు మహమ్మద్ రియాజ్ జ్ఞాపకార్థం ఈ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్లు మల్లేష్ రాము ,రాజేందర్ ,అలీమ్ మరియు చింటూ తెలిపారు. ఈ పోటీల్లో దాదాపు 40 టీంలు పోటీపడుతున్నట్లు ఫైనల్లో గెలుపొందిన జట్టుకు 80 వేల రూపాయలు మరియు రన్నర్ జట్టుకు 40,000 బహుమతులు అందజేస్తున్నట్లు ఆర్గనైజర్లు తెలిపారు. ఈ టోర్నమెంట్ దాదాపు పది రోజులపాటు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దాతలు మాజీ ఎంపిటిసి మౌనిక హరికృష్ణ గౌడ్ మాజీ సర్పంచ్ అరుణ శివకుమార్ మరియు మాజీ సర్పంచ్ పరుశురాం మాజీ డిప్యూటీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మరియు మాజీ కో ఆప్షన్ నెంబర్ ఎల్లయ్య మాజీ వార్డ్ సభ్యులు వెంకటయ్య ,మాధవి మరియు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహ సింగిల్ విండో మెంబర్ ప్రభాకర్, పోలే శ్రీహరిజర్నలిస్టు పనిందర్,పోలే ఆంజనేయులు జగన్ మరియు వార్డ్ మెంబర్ యూత్ సభ్యులు వివిధ గ్రామాల క్రీడాకారులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు