పయనించే సూర్యుడు అక్టోబర్ 14 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
30 వేల మంది దళిత గిరిజన విద్యార్థులను విద్య అందించాలి.
బకాయిల పేరుతో విద్యార్థులను పాఠశాలలకు అనుమతించని ప్రైవేట్ పాఠశాలలు.
గత వారం రోజుల నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనకు స్పందించని రాష్ట్ర ప్రభుత్వం.
ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడిస్తాం.
వైరా బోడేపూడి భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో
తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి భూక్యా వీరభద్రం.
బెస్ట్ అవైలబుల్ స్కీమ్ క్రింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 238 ప్రైవేట్ విద్యా సంస్థలో 30000 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుతున్నారు. బెస్ట్ అవైలబుల్ స్కీం పథకం 20 సంవత్సరాల నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుంచి అమలు అవుతుంది. గత రెండు సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం 180 కోట్ల రూపాయలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ విద్యా సంస్థల అసోసియేషన్ విద్యార్థులను పాఠశాల రాకుండా నిలుపుదల చేశారని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం వైరాలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 16వ తేదీన జరుగు క్యాబినెట్ సమావేశంలోపు బకాయిలు విడుదల చేయకపోతే 17వ తేదీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన కార్యక్రమం చేపడతారని, అనంతరం అక్టోబర్ 20వ తేదీ తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పెద్ద ఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు ముట్టడి చేస్తారని ఆయన తెలిపారు. దళిత, గిరిజన విద్యార్థులను ప్రభుత్వం విద్యా నుంచి దూరం చేయకుండా వెంటనే చర్యలు చేపట్టి పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన సంఘం తోపాటు విద్యార్థి, దళిత సంఘాలు, ప్రజాసంఘాలు కలుపుకొని ఆందోళన ఉదృతం చేస్తామని ప్రభుత్వానికి తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ గిరిజన సంఘం నాయకులు బానోతు హరిచంద్ నాయక్, ధరావత్ నరసింహారావు నాయక్, గుగులోత్ రాజారాం నాయక్, శ్రీనివాస్ నాయక్, విద్యార్థుల తల్లిదండ్రులు పొట్టేటి మధుబాబు, ఎం.కిరణ్, గుగులోత్ నరేష్, శాఖ పుల్లమ్మ, బానోతు లింగా, తదితరులు పాల్గొన్నారు.