
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి
కార్యక్రమానికి హాజరైన ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ …
డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బైంసా పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అంబేద్కర్ చేసిన గొప్ప సేవలను స్మరించుకున్నారు. ఆయన చూపిన మార్గంలో నడవాలని, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆలోచనలు, సిద్ధాంతాలు సామాజిక న్యాయానికి పునాది అని పేర్కొన్నారు.రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, అలాగే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో చర్చలు జరిపినట్లు వెల్లడించిన ఎమ్మెల్యే, బైంసా పట్టణంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి రూ.50 లక్షల నిధులను త్వరలోనే ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించనున్నట్లు స్పష్టం చేశారు.
