
పయనించే సూర్యుడు నవంబర్ 26 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
సూళ్లూరుపేట పట్టణంలోని సూళ్లూరులో కరెంట్ ఆఫీస్ దగ్గర నుండి బొగ్గులు కాలనీకి నడిచి వెళ్తున్న మన్నారు మంగమ్మ అనే వృద్ధ మహిళ మెడలో బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి లాక్కు వెళ్లడం జరిగింది అక్కడ కు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించడం జరిగింది ఇద్దరూ గుర్తు తెలియని యువకులు నంబర్ ప్లేట్ లేని KTM బైక్ పై వచ్చి మహిళ మెడలో బంగారు గొలుసును లాక్కెళ్ళినట్టు గుర్తించారు దీనికి సంబంధించి ఏవైనా వివరాలు తెలిసినట్లయితే సూళ్లూరుపేట సీఐ కి గానీ 9440796361 మరియు SI నంబర్ 9440796361 గాని తెలియజేయాలని కోరుతున్నారు, అంతేకాకుండా సూళ్లూరు కరెంట్ ఆఫీస్ నుండి బొగ్గులు కాలనీకి వెళ్లే దారిలో వీధిలైట్లు వెలగడం లేదు అని ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సూళ్లూరుపేట మున్సిపాలిటీ కమిషనర్ స్పందించడం లేదు ఇకనైనా స్పందించి పట్టణంలో విద్యుత్ దీపాలు వెలగని అన్ని స్తంభాలు లైట్లు అమర్చ వలసిందిగా కోరడమైనది