పయనించే సూర్యుడు జనవరి 10 మంథని నియోజకవర్గం మంథని మున్సిపాలిటీ పరిధిలోని బొక్కల వాగు కట్ట పై ఏర్పాటు చేసిన రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరుతూ ఎన్ హెచ్ ఆర్ సి;ఎన్ జి ఓ,పెద్దపెల్లి జిల్లా చైర్మన్ మాచీడి దిలీప్ మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం సమర్పించారు.
బొక్కల వాగు కట్ట పై ప్రతి రోజు ఉదయం సాయంకాలం పట్టణ ప్రజలు వాకింగ్ చేస్తూ ఉంటారు. అలాగే పాదచారులు వస్తుంటారు. ఇదే సమయంలో కొంత మంది వాహన చోదకులు వేగంగా వెళ్ళడంతో ప్రమాదాలు జరిగి ఆస్పత్రుల పాలై అప్పుల పాలవుతున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు.విలువైన జీవితాలను కూడా కోల్పోతున్నారు.గతంలో బొక్కల వాగు కట్ట పైనుంచి వెళుతూ వాహన చోదకులు వాగులో పడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి.బొక్కల వాగు కట్టపైన ఉన్న రోడ్డుకు,బ్రిడ్జి వద్ద స్పీడ్ బ్రేకర్ లు,రెయిలింగ్ ఏర్పాటు చేస్తే కొంతలో కొంతైనా ఈ ఉపద్రవాలను నివారించే అవకాశం ఉంటుందని అన్నారు. మున్సిపల్ పాలకవర్గం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు.