వాగు ఉదృతిని పరిశీలిస్తున్న సీపి సాయి చైతన్య…
రుద్రూర్, ఆగస్టు 16 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి వద్ద గుండ్ల వాగు లోలెవల్ బ్రిడ్జి పై నుంచి ప్రవహిస్తున్న వరద నీటి ప్రవాహాన్ని సీపి పి.సాయి చైతన్య పరిశీలించారు. ఈ సందర్భంగా సీపి మాట్లాడుతూ.. కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సిపి వెంట ఏసిపి శ్రీనివాస్, సీఐ కృష్ణ, ఎస్సై సాయన్న, పోలీసు సిబ్బంది ఉన్నారు.