
పైసా కొట్టు రేషన్ కార్డు పట్టు అర్హత లేని వారికి కూడా రేషన్ కార్డులు జారీ
పయనించే సూర్యుడు నవంబర్ 05 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ప్రతి ఏడాది ఖమ్మం జిల్లా లో ఉన్నటువంటి వ్యాపారస్తులు లక్షలు సంపాదించే వ్యాపారాలు ఉన్నవారు అలాగే సొంత భవనాలు భూములు ఉండి నెలకు లక్షల్లో ఆదాయం పొందుతున్న వారు ఖరీదైన కారు ఉన్నవారు కూడా రేషన్ కార్డు పొందారు అంగట్లో సర్కుల రేషన్ కార్డు దందా అక్రమార్కులు ధరలు నిర్ణయించడంతో ధనవంతులు కూడా రేషన్ కార్డు పొంది ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటున్నారు
కొన్నిచోట్ల మీసేవ కేంద్రాల నిర్వహకులు చేతివాటం చూపించారు మరికొన్ని చోట్ల తాసిల్దార్ తాసిల్దార్ కార్యాలయంలోని కిందిస్థాయి సిబ్బంది కంప్యూటర్ ఆపరేటర్లు ఈ అక్రమార్కుల అవతారం ఎత్తి లక్షల్లో ఆదాయం సంపాదించుకున్నారు ఆదాయం ఎక్కువ ఉన్న వారికి కూడా తక్కువ ఆదాయం చూపించి అంతా మేమే చూసుకుంటామని చెప్పి వసూళ్లకు పాల్పడ్డారు అర్హత లేని వారికి రేషన్ కార్డులు జారీ చేశారు ఖమ్మం జిల్లాలో ఇంత పెద్ద తరహాలో రేషన్ కార్డు దందా నడుస్తున్న మరి జిల్లా కలెక్టర్ జిల్లా యంత్రాంగా అధికారులు డి సి ఎస్ ఓ మరియు ఉన్నత అధికారులు సమాచారం తెలుసుకుంటున్నారా తెలిసి కూడా మనకెందుకులే అని ఉంటున్నారా అనేది అర్థం కాని పరిస్థితి మరి ఈ విధంగా అక్రమార్కుల ద్వారా జారీ అయిన రేషన్ కార్డులను ప్రత్యేక అధికారులను నియమించి అట్టి దొంగ రేషన్ కార్డులను వెంటనే తొలగించాలని నిరుపేద కుటుంబాల లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు కొన్నిచోట్ల చౌక ధరల దుకాణాల యాజమాన్యులు రేషన్ దందా అలాగే రేషన్ బియ్యం దందా నడుపుతున్నారు అనే విశ్వసనీయమైన సమాచారం వీటిపై డి సి ఎస్ ఓ లు జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టి మరింత లోతుగా ఆరా తీసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్