పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లాలో
ఈ రోజు మంగళవారం రోజున బోధన్ నియోజకవర్గం లో బ్లాక్ ఏ మరియు బ్లాక్ బి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘటన శ్రీజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్ణాటక ఎమ్మెల్యే, ఏఐసిసి పరిశీలకులు రిజ్వాన్ అర్షద్ పాల్గొన్నారు. అనంతరం డిసిసి అధ్యక్ష పదవి నియామకం కొరకు అందరి అభిప్రాయాలు తీసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నీ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ నీ ప్రధాన మంత్రి చేయడానికి కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా డిసిసి మరియు సీసీసీ ల నియామకం చేపట్టిందని,ప్రజల మధ్య ఉంటూ పార్టీ కోసం పనిచేసే పలికే పదవి దక్కుతుంది అన్నారు.దేశంలో బీజేపీ ఎలక్షన్ కమిషన్ ను, సిబిఐ ను తమవద్ద ఉంచుకొని ఎవరూ తమను ఓడించలేము అని అహంకారంతో ఉన్నారని మరోవైపు దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఉన్నారని ఆయన అన్నారు భారతదేశ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వ్యక్తులని వారికి నచ్చిన వారికి అధికారం ఇస్తూ నచ్చని వారి ఇంటికి పంపిస్తారని త్వరలోనే బిజెపి ఇంటికి పోయి రోజులు వస్తున్నాయని ఆయన అన్నారు రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎవరు తమను ఊహించలేము అనే అహంకారంలో ఉన్న సమయంలో తెలంగాణ ప్రజలు బి.ఆర్.ఎస్ ను ఇంటికి పంపి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ఎంతో ముందంజలో ఉంది అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్,డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి,వ్యవసాయ కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్,అరెపల్లి మోహన్ , రవి బాబు, డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి,పిసిసి డెలిగేట్ గంగా శంకర్,అంత రెడ్డి రాజారెడ్డి మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు.