పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 22 బోధన్ ప్రతినిధి బోధన్ పట్టణం లోని రమాకాంత్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల సమావేశానికి ముఖ్యఅతిథిగా బీజేపి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి వర్యులు జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అనేక రకాల హామీలను ఇచ్చింది అని టీచర్ లను ఉదోగ్య భద్రతను ఇస్తాము అని విద్య భరోసా కార్డు ఇస్తాము అన్నారు కాలేజీ వెళ్లే విద్యార్థులకు స్కూటీ లను ఇస్తాము అని ఏ హామీలను నెరవేర్చాలేని కాంగ్రెస్ పార్టీ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓట్ల అడిగే హక్కు లేదని ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో కనీసం 50 శాతం అన్న పూర్తి చేసి ప్రజల ముందుకు రావాలని అన్నారు ప్రజలు కాంగ్రెసు ప్రభుత్వం పై విసిగి పోయారు అని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాలి అని మరియు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ టీచర్లను మోసం చేసింది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇవాళ అప్పుల ఊబిలో కూరుకుపోయింది అని పేర్కొన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజి రెడ్డికి మొదటి ప్రాధానత్య ఓటు వేసి గెలిపించలని కోరారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచరి నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు ధనపాల్ సూర్య నారాయణ గుప్త బీజేపి రాష్ట్ర కార్యదర్శి పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి (MPR) వడ్డీ మోహన్ రెడ్డి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ రెడ్డి జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి సీనియర్ నాయకులు నరసింహ రెడ్డి కందగట్ల రాంచందర్ యువ నాయకులు ముద్ద సంగ్రామ్ పటేల్ వివిధ మండలాల అధ్యక్షులు కొలిపాక బాలరాజు ఇంద్రకరణ్ గోపీకృష్ణ సరిన్ మనోహర్ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు