పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 2 నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని రేంజల్ మండలంలోని బోర్గాం గ్రామంలో సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బొర్గం గ్రామ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కార్తీక్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పేదల వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు పెద్దలు బోధన్ నియోజకవర్గ శాసన సభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిరాడి రవి ఉపాధ్యక్షులు సిద్ద సాయిలు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గైని కిరణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరాడి సంజీవ్ దుపల్లి హన్మాండ్లు మద్దెల రాజశేఖర్ మరియు బోర్గం గ్రామస్తులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు