అంబేద్కర్ యువజన సంఘం, మక్తల్
పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 11 మక్తల్:- అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ ఆధ్వర్యంలో స్థానిక మక్తల్ పట్టణ కేంద్రంలోని విశ్రాంతి గృహం నందు చిలుకూరి బాలాజీ టెంపుల్ పూజారి రంగరాజన్ పై దాడిని నిరసిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లాకి చెందిన హిందూ మతోన్మాద దుర్మార్గులు వీర రాఘవరెడ్డి మరియు అతడి అనుచరులు గత రెండు రోజుల క్రితం రామరాజ్య స్థాపనకు ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేస్తున్నామని కాబట్టి దానికి డబ్బులు ఇవ్వాల్సిందిగా చిలుకూరి బాలాజీ దేవాలయ బ్రాహ్మణ పూజారి రంగరాజన్ పై ఒత్తిడి చేసి,దాడి చేసిన దుర్మార్గులను ప్రభుత్వం వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించి, పూజారి రంగరాజన్ కి న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.అంతే కాకుండా రాజ్యాంగంలోని లౌకిక ప్రజాస్వామ్య స్ఫూర్తిగా విరుద్ధంగా గత కొంతకాలంగా గౌరవ ప్రజాప్రతినిధుల స్థాయిలలో ఉన్నటువంటి బండి సంజయ్, రాజాసింగ్ వంటి మతోన్మాద నాయకులు ఈ భారతదేశం ఒక్కప్పటి హిందూ దేశమని,ఇక్కడ రామరాజ్యం స్థాపిస్తామని ప్రకటనలు చేస్తూ… కలిసి మెలిసి బతుకుతున్న ప్రజల మధ్య మతకలహాలకు కారణం అవుతున్నారని…వీరి వలనే దేశ వ్యాపితంగా ఎక్కడపడితే అక్కడ మతోన్మాద గుండాలు దాడులకు పాల్పడుతున్నారని… ఈ విధంగా రాజ్యాంగంలోని లౌకికస్ఫూర్తి కి విరుద్ధంగా చర్యలకు పూనుకునే గుండాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వీరిపై రాజ్య ద్రోహం కేసులు పెట్టి, కఠినంగా శిక్షించాలని *అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ గా కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్ క్రియాశీలక సభ్యులు సభ్యులు బ్యాగరి శ్రీహరి, కే సురేష్, కర్నే సురేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.