మంత్రి సవితమ్మ చేతుల మీదుగా ప్రత్యేక పూజలు.
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 05 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్
గోరంట్ల పట్టణంలోని చిత్రావతి నది ఒడ్డున గల బ్రాహ్మణ మరియు వైశ్యుల స్మశాన వాటికకు నూతన సిమెంట్ రోడ్డు నిర్మాణానికి మంత్రి సవితమ్మ భూమి పూజ కార్యక్రమాలు చేపట్టారు. మండలంలోని బ్రాహ్మణ మరియు వైశ్యుల కోరిక మేరకు ప్రభుత్వ నిధులతో సిమెంట్ రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ పనులు ప్రారంభం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ పెద్దలు జిఎం. సురేష్, కృష్ణమూర్తి, రమణ రావు, రెడ్డి కేశవ ప్రసాద్, ఆర్య వైశ్యులు బలరాం గుప్తా, నందగోపాల్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.