పయనించే సూర్యుడు సెప్టెంబర్ 13 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి కుమార్ : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సెవెన్ హిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవా లయంలో స్వచ్ వాయు దివాస్, వన మహోత్సవం కార్యక్రమాల్లో భాగంగా దేవాలయంలో సుదర్శన హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి,అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులకు మొక్క లు పంపిణీ చేసిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ… జిహెచ్ఎంసి వారి ఆధ్వర్యంలో స్వచ్ వాయు దివాస్, వన మహోత్సవం కార్యక్రమాల్లో భాగంగా సెవెన్ హిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాల యంలో వచ్చిన భక్తులకు తులసి, మారేడు,మునగ, మెహందీ,రాణపా ల,బంతి,మందారం తదితర మొక్కల ను పంపిణీ చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి జిహెచ్ఎంసి హార్టికల్చర్ విభాగం దాసువారి సిబ్బంది,నాయకు లు, భక్తులు, డివిజన్ వాసులు తదిత రులు పాల్గొన్నారు.