
పయనించే సూర్యుడు జూలై 29 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం మండలం భట్నంవెల్లి గ్రామంలో ఈరోజు అనగా 28-7-2026 తేదీన వేంచేసి ఉన్న గ్రామ దేవత వనవులమ్మ వారి తీర్థ మహోత్సవం వైభవంగా జరిగింది.ఈ ఉత్సవంలో రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు పితాని బాలకృష్ణ పాల్గొన్నారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు, గ్రామస్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న పితాని బాలకృష్ణ గ్రామ అభివృద్ధి గురించి గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామంలోని సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఉత్సవంలో భాగంగా అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.