అంబం గ్రామంలో భాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న దృశ్యం..
రుద్రూర్, మార్చ్ 16 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండలం అంబం(ఆర్) గ్రామంలో శుక్రవారం జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయినటువంటి రెండు కుటుంబాలకు గ్రామానికి చెందిన హెల్పింగ్ హాండ్స్ మిత్రబృందం ఆధ్వర్యంలో శనివారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ మిత్రబృందం వడ్ల సాయిబాబా, కుర్లపు గంగాధర్, ఆతుకూరి అశోక్, రేపల్లి సాయి ప్రసాద్, పట్టెపు శ్రీనివాస్, కొండ బాలు, మంత్రి సురేష్, సాకలి సాయిలు తదితరులు పాల్గొన్నారు.