పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16(వైరా నియోజకవర్గ రిపోరర్ ఆదూరి ఆనందం )
భారతదేశానికి భారతరత్న మోక్షగుండం మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు చాలా అమోఘమని, వైరా పట్నంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్
యల్.నవీన జ్యోతి తెలిపారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదిన సందర్భంగా, భారత ప్రభుత్వం మోక్షగుండా విశ్వేశ్వరయ్య సేవలను గుర్తించి దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 15న ఇంజనీరింగ్ డే గా నిర్వహిస్తున్నారు అని తెలిపారు కళాశాల ఒకేషనల్ విభాగ విద్యార్థులు ,అధ్యాపకులు ఏర్పాటుచేసిన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదిన కార్యక్రమ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలతో అలంకరించడం జరిగింది ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ,మాట్లాడుతూ చిన్నప్పుడే పేదరికం ఉన్నప్పటికీ కష్టపడి ఉన్నత చదువులు చదివి ఇంజనీరింగ్ లో ప్రావిణ్యత సంపాదించి, వరదలు, కరువులు తట్టుకోవడానికి అనేక ప్రాంతాలలో జలాశయాలు నిర్మించారని ,నాటి నిజాం ప్రభువు కోరికపై హైదరాబాదులో వరదల్ని, తట్టుకోవడానికి హైదరాబాదులో రెండు జలాశయాలు నిర్మాణంలో కీలకపాత్ర వహించడం జరిగింది అని తెలిపారు. నేటికీ ఆ జలాశయాలు హైదరాబాద్ ప్రజలకు చాలా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఒకేషనల్ అధ్యాపకులు ఇంజనీరింగ్ విద్య ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ఒకేషనల్ విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టు ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కళాశాల టీచింగ్, నాన్ -టీచింగ్ స్టాప్, విద్యార్థుల ,విద్యార్థులు పాల్గొన్నారు.