పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 22. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు స్వాతంత్ర్య సమరయోధుడు తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న దివంగత మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి 67 వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా హాజరై మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి చిత్రపటానికి నివాళులర్పించిన గౌరవ శాసనసభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయక్
ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర్య సమర ముఖ్య నాయకులలో ఒకడు. అతను ప్రఖ్యాత పండితుడు, కవి. అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పెర్షియన్, బెంగాలీ మొదలగు అనేక భాషలలో ప్రావిణ్యుడు.భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసాడు. గాంధీజీ ఇతడిని భారత ప్లాటో అని, గాంధీ , నెహ్రూ ఇతడిని మౌలానా, మీర్-ఎ-కారవాన్ అని పిలిచేవాడు. మౌలానా తపాలా స్టాంప్ భారత ప్రభుత్వం మరణానంతరం (1888-1958) 1992లో అతనికి భారతరత్న ఇచ్చి గౌరవించింది.ఇతడి జన్మదినం నవంబరు 11 ను జాతీయ విద్యా దినోత్సవం గా జరుపుకుంటారు వారి సేవలను కొనియాడారు..ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏదునూరు సీతారాములు, బొర్రా రాజశేఖర్, కట్ల రంగారావు, సూరంపల్లి రామరావు, సూతకాని జైపాల్, పమ్మి అశోక్, బోళ్ళ గంగారావు, పాలేటి నరసింహారావు, గొల్లపూడి కృష్ణారావు, బీడీకే రత్నం, పల్లపు కొండలు, పణితి శ్రీను, చప్పిడి వెంకటేశ్వరరావు, బత్తుల గీత-శ్రీను, ధర్నా రాజశేఖర్, వీరంశెట్టి సీతారాములు, కొల్లి రమేష్, జవ్వాజి నాగరాజు, ఆది ఆనందరావు, తోటకూర గోపి, మీరా, మెరుగు వెంకటి గరిడేపల్లి వెంకటేశ్వర్లు, బండి వెంకటేశ్వర్లు, షేక్ చిచ్చ జాన్, షేక్ ఆన్సర్, కట్ల సాయి, ధరావత్ శంకర్ నాయక్, ధీరావత్ వెంకటేశ్వర్లు, హనుమా, లక్ష్మణ్ నాయక్, పనేం భాస్కర్, మూడుముంతల శ్రీను, మూడుముంతల సైదులు, సంపసాల శ్రీను, మల్లెబోయిన సైదులు, తదితరులు పాల్గొన్నారు.