
పయనించే సూర్యుడు డిసెంబర్ 30 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా ఆత్మకూరు వాసి చింతలపల్లి భరత్ రెడ్డి
భారతీయ జనతా యువమోర్చా నూతన జిల్లా అధ్యక్షుడిగా చింతలపల్లి భరత్ రెడ్డి ని బిజెపి జిల్లా అధ్యక్షులు ఎస్ వంశీధర్ రెడ్డి అధ్యక్షతన నియమించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేవైఎం నూతన జిల్లా అధ్యక్షులు సిహెచ్ భరత్ రెడ్డి మాట్లాడుతూ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా తన ఎన్నుకున్నందుకు పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్ వంశీధర్ రెడ్డి కి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే చేజర్ల మండలం భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా ఆత్మకూరు వాసి చింతలపల్లి భరత్ రెడ్డి కి పదవి ఇచ్చిన సందర్భంగా మండల కేంద్రమైన చేజర్ల బిజెపి నాయకులు హర్ష వ్యక్తం చేశారు బిజెపి చేజర్ల మండల అధ్యక్షులు గుండాల విజయభాస్కర్ రెడ్డి. వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ జిల్లా బత్తల కిష్టయ్య. బి జె వై ఎమ్ కుండ శివారెడ్డి. జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు జగ్గారెడ్డి. పెంచలయ్య. బిజెపి మండల నాయకులు. కార్యకర్తలు అభిమానులు బిజెపి జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి కి పదవి బాధ్యతలు పొందిన చింతలపల్లి భరత్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు