( పయనించే సూర్యుడు ఏప్రిల్ 25 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) నేటి నుంచి హైదరాబాద్ లోని హెచ్.సి.సి. లో జరుగుతున్న భారత్ సమ్మిట్ లో షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో వందకు పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరు అయ్యారు. దాదాపు 450 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్ కు హాజరు కానున్నారు.రాష్ట్రాన్ని పెట్టుబడులు, ఆర్థిక వృద్ధి, మేధో నాయకత్వంలో అగ్రగామిగా నిలిపేందుకు ఈ సదస్సు కీలకం కానున్నది. రాష్ట్రంలో దేశవిదేశీ పెట్టుబడులను పెంచడం, రాష్ట్రాన్ని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయడం,సాంకేతిక ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించడం తదితర సదస్సులో భాగంగా ఉన్నాయి. ఈ సదస్సులో భాగంగా రాష్ట్రంలోని వనరులు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించేందుకు ప్రత్యేక స్లాట్ కేటాయించారు. ఈ సదస్సులోతెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్,మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు .