ఆయన మరణం భారత కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు
గుగులోత్ రామచందర్ సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యుడు
పయనించే సూర్యుడు ఆగస్టు 23 (పొనకంటి ఉపేందర్ రావు)
భద్రాద్రి టేకులపల్లి: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అగ్ర నేత. మాజీ జాతీయ కార్యదర్శి. నల్లగొండ జిల్లా రెండు పర్యాయాలు పార్లమెంట్ సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి ఆయన మరణం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు. అనునిత్యం ప్రజల గురించి ఆలోచించి వారి కోసమే పనిచేసిన సుధాకర్ రెడ్డి ఇంక లేరు అంటే నమ్మలేకపోతున్నాను. కమ్యూనిస్టు పార్టీలో అంచలంచలుగా ఎదిగి సిపిఐ జాతీయ కార్యదర్శి స్థాయికి చేరారు. ఏ పదవిలో ఉన్న విలువలతో రాజీ పడకుండా విద్యార్థి ఉద్యమ నాయకుడిగా. కార్మిక నాయకుడిగా. ఉద్యమ నేతగా క్రియాశీలక నాయకుడు. పార్టీకి పనిచేసిన సుధాకర్ రెడ్డి కి ఘన నివాళి అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు టేకులపల్లి మండల సమితి తరపున ప్రగాడ సానుభూతి వ్యక్తం పరుస్తూ ఈ యొక్క కష్ట కాలంలో వారి యొక్క కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ జోహార్లు అర్పిస్తున్నాం. ఈ కార్యక్రమంలో టేకులపల్లి మండల సహాయ కార్యదర్శి ఐత శ్రీరాములు గుగులోతు శ్రీను మల్లయ్య శ్యాం బాబు ప్రసాద్ చింటూ సోనీ హాంజీ సంతోషమా తదితరులు పాల్గొన్నారు