
పయనించే సూర్యుడు డిసెంబర్ 24,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
"సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ "
"సిపిఐ నంద్యాల పట్టణ కార్యదర్శి కె ప్రసాద్"
నంద్యాల సిపిఐ కార్యాలయంలో సిపిఐ పట్టణ కౌన్సిల్ సభ్యుల సమావేశం సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి లక్ష్మీదేవి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జి నాగ రాముడు సిపిఐ జిల్లా నాయకులు పి మురళీధర్ సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి భూమని శ్రీనివాసులు ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు మహిళా సమాఖ్య పట్టణ కార్యదర్శి సుశీలమ్మ సిపిఐ పట్టణ నాయకుడు ధనుంజయ్ హాజరు కావడం జరిగింది. అనంతరం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసి 101 వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈనెల 26వ తారీఖున అన్ని శాఖలలో పతావిష్కరణలు గావించి పార్టీ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ఆవిర్భవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భారత గడ్డపై ఎన్నో వీరోచిత పోరాటాలు నిర్వహించిన ఘన చరిత్ర ఉందని అన్నారు. భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తికై నిరంకుశ నైజాం నవాబులను గద్దె దించడానికి మహోత్తర తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగున్నర వేల మంది ప్రాణ త్యాగాలతో మూడు వేల గ్రామాలను విముక్తి చేసి పది లక్షల ఎకరాల భూమిని పంచిన చరిత్ర సిపిఐ దని అన్నారు. ఇటువంటి ఘన చరిత్ర గల సిపిఐ నూట ఒకటవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ శాఖ కార్యదర్శిలు. సహాయ కార్యదర్శులు. పీఎం రమేష్. ప్రవీణ్. సాల మద్దిలేటి. మద్దయ్య. చాంద్ బాషా. శిక్షావలి. మా భాష. దానం. నాగార్జున. హుస్సేన్. రవి. తదితరులు పాల్గొన్నారు.
