ఎమ్మెల్యే క్యాంపుకార్యాలయంలో.. కొయ్యడ శ్రీనివాస్...
పయనించే సూర్యుడు పరకాల ప్రతినిధి గొట్టే రమేష్.. పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో భారత జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పరకాల అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ ఫోటోకు పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ గాంధీ గారు చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కొనియాడారు. అహింస, సత్యాగ్రహం అనే ఆయుధంతో దేశ ప్రజలందరినీ ఒక తాటిపై నడిపించి హింస ఎలాంటి సంఘటన లేకుండా అహింసా, సత్యాగ్రహంతో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మానియుడని ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతిని జరుపుకోవడం దివ్య సంస్కృతికీ నివాళ్ళని కొనియాడారు. ఇట్టి కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి మాజీ ఎంపీపీఒంటెరు రామ్మూర్తి మరియు చిన్నాలగోనాథ్ చందుపట్ల రాఘవరెడ్డి పబ్బ శ్రీనివాస్ సూదమల్ల కిషోర్ ఏకు సుధీర్ బాబు పూసల సదానందం కిషన్ మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.