
పయనించే సూర్యుడు నవంబర్ 03 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారిగా వన్డే ప్రపంచకప్ ను కైవసం చేసుకొని భారత క్రీడా చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ మరియు రైతు నాయకుడు మేడా ధర్మారావు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా మేడ ధర్మారావు మాట్లాడుతూ, మహిళలు క్రీడారంగంలో చూపుతున్న ప్రతిభ దేశానికి గర్వకారణమని, ఈ విజయం భారత మహిళా శక్తి స్ఫూర్తిని ప్రపంచానికి చాటిందని పేర్కొన్నారు. ప్రపంచకప్ టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓటమి ఎదురైనా ధైర్యంగా చివరి దాకా పోరాడి చరిత్ర సృష్టించిందని కొనియాడారు.సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై రికార్డు రన్స్ ఛేదన చేసి విజయం సాధించడమే కాకుండా, ఫైనల్లో దక్షిణాఫ్రికాపై సమిష్టిగా రాణించి ఘన విజయం సాధించడం దేశ ప్రజలకు గర్వకారణమని మేడ ధర్మారావు అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే అంతర్జాతీయ వేదికపై భారత జెండాను ఎగురవేయాలని ఆకాంక్షిస్తూ, జట్టు కోచ్, మేనేజ్మెంట్, సపోర్ట్ స్టాఫ్ అందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.