జస్టిస్ బి.ఆర్ గవాయి పై జరిగిన దాడి ప్రజాస్వామ్యానికి పెనుముప్పు
దాడికి పాల్పడిన సనాతన మతోన్మాద వ్యక్తిపై దేశద్రోహం కేసు నమోదు చేసి,కఠినంగా శిక్షించాలి.
బిజెపి పాలనలో సనాతన ధర్మ రక్షణ పేరుతో జరుగుతున్న మతోన్మాద దాడులను తిప్పికొడదాం
{ పయనించే సూర్యుడు} {అక్టోబర్ 8} మక్తల్
దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై ఒక సనాతన దుర్మార్గుడు రాకేష్ కిషోర్ కోర్టు హాలులో న్యాయవాదులందరూ చూస్తుండగానే దాడికి పూనుకున్న అత్యంత హేయమైన,దుర్మార్గమైన చర్యను ఖండిస్తూ భారత రాష్ట్రపతి గారికి మక్తల్ మండల్ తహసీల్దారు ద్వారా మెమోరాండం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మతోన్మాది,సనాతన దుర్మార్గుడు న్యాయవాది ముసుగులో రాజ్యాంగబద్ధమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయి గారిపై చేసిన దాడినీ స్వతంత్ర న్యాయ వ్యవస్థపై,మన భారత రాజ్యాంగంపై,దళిత ప్రధాన న్యాయమూర్తి పై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు. ఇటువంటి సనాతన దుర్మార్గ న్యాయవాది రాకేష్ కిషోర్ ను వెంటనే అరెస్టు చేసి, దేశద్రోహం కేసులను నమోదు చేసి కఠినంగా శిక్షించాలనీ అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అతడి లైసెన్స్ ని శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.అలాగే దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తికే రక్షణ లేకుంటే దేశంలోని సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.
అదేవిధంగా మనుస్మృతిని తమ రాజ్యాంగంగా కొనసాగించాలనే కుట్రతో బిజెపి దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు వి.హెచ్.పి.బజరంగ్దళ్ వంటివి సనాతన ధర్మ రక్షణ పేరుతో ఈ విధమైన మతోన్మాద దాడులను ప్రేరేపిస్తున్నాయన్నారు.దానిలో భాగంగానే సెక్యులర్ వాదానికి ప్రతిబింబమైన నూతన పార్లమెంటు భవన ప్రారంభానికి ఆదివాసి మహిళ అయినా రాష్ట్రపతి ద్రౌపది మురుముకు బదులుగా ప్రధాని నరేంద్ర మోడీ హిందూమత సన్యాసులతో కలిసి ప్రారంభించి, ఏకపక్షంగా హిందుత్వ మతోన్మాదాన్ని బలపరిచి, రాజ్యాంగబద్ధమైన రాష్ట్రపతి పదవినీ,ద్రౌపది మురుము గారిని అవమానించి భారత రాజ్యాంగం పట్ల వారి వ్యతిరేకతను చాటుకున్నారు.ఇంతే కాకుండా దేశంలోనీ బిజెపి పాలిత రాష్ట్రాలు రాజ్యాంగ చట్టాలను అవమానపరిచేలా బుల్డోజర్ న్యాయాన్ని అమలు చేస్తూ న్నారన్నారు.కావున ఈ మనువాద బిజెపి, ప్రభుత్వాన్ని,సనాతన వాద దుర్మార్గ శక్తులను ప్రజలు,ప్రజాస్వామికవాదులు ఇప్పటికైనా ఎదుర్కోకపోతే ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగానికి, భారతదేశ ప్రజలకు భవిష్యత్తు ఉండదని ఆందోళన వ్యక్తం చూస్తారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా నాయకులు విజయ్ కుమార్, అంబేద్కర్ యువజన సంఘం మాజీ అధ్యక్షులు పరంధాములు టీచర్, డీఎస్పీ నాయకులు తిమ్మరాజు,ఆర్టిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ గొల్లపల్లి,అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షులు వెంకటేష్,సహాయ కార్యదర్శి రవికుమార్,కోశాధికారి త్రిమూర్తి,నాయకులు పళ్ళ రాజేష్, తల్వార్ నరేష్, శ్రీహరి బ్యాగరి, రవికుమార్, జగ్గలి రమేష్, కర్రెమ్ సురేష్, సందీప్, నాగేష్ గోలపల్లి,ఎల్ల లింగప్ప,అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.