పయనించే సూర్యుడు: జనవరి 10: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి.ఎ.
వాజేడు: ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం నుండి వాజేడు వెళ్లి ప్రధాన రహదారి పై నిత్యం భారీ లోడుతో ఇసుక లారీలు ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే వాజేడు మండలంలోని ఘనపురం కాలనీ గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై భాగంలో వేసిన బీటీ (డాంబార్)భారీగా పెచ్చులు పెచ్చులుగా ఉడిపోతున్నాయి. ఇందుకు గల ప్రధాన కారణం అధికలోడుతో వెళ్తున్న ఇసుక లారీలు అయితే మరొక కారణం నాణ్యత లేకుండా పోసిన రోడ్డు అని పలువురు గ్రామస్తులు ప్రయాణికులు వాపోతున్నారు. అంతేకాకుండా ఈ యొక్క రహదారిపై బీటీ పరిచి కనీసం సంవత్సర కాలం కూడా కాకపోవటం గమనార్హం. కాబట్టి ఎందుకు సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు చొరవ చూపించి నాణ్యత మైన రహదారులు నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా పరిమితి మించి లోడు వెళ్లకుండా నియంత్రించాలని పలువురు కోరుతున్నారు.