సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న సిపిఐఏపీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు.
పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 16, ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ.
వరస అతివృష్టి,అనావృష్టితో వ్యవసాయ రంగం రైతంగానికి పూర్తిస్థాయిలో భారం అవుతుందని,ఈ ఏడాది ఎడతెరపు లేకుండా కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతూ . ఏపీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం,సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ సీనియర్ నాయకులు కె.అజయ్ బాబు , సిపిఐ మండల కార్యదర్శి కల్లుబావిరాజు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, .ఏపీ రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి మాదిరి ఎల్లప్ప, వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు కొత్తూరు గంగన్న ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు శివ రాములు.మాట్లాడుతూ ఎన్నో కష్టనష్టాలను అధిగమించి వ్యవసాయం చేస్తున్న రైతాంగం తీవ్రస్థాయిలో అప్పుల పాలయ్యి వలసల బాట పడుతున్న ప్రభుత్వానికి పట్టినట్టు వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. 20 రోజుల పాటు కురిసిన వర్షం, ఎనిమిది రోజులు గ్యాప్ తో మరో పది రోజుల కురిసిన వర్షానికి పంట సాగు నీట మునిగే పూర్తిగా నాశనం అయిందన్నారు. తూర్పు ప్రాంతం ఎర్ర రేగడి నేలల్లో పత్తి చేతుకొస్తున్న క్రమంలో అధిక వర్షాలతో పత్తి కాయ కుళ్ళిపోయి, పగిలిన పత్తి నీటిలో కలిసిపోయి నేలరాలిందన్నారు. అతివృష్టి, అనావృష్టిని లెక్కచేయకుండా అతి కష్టకాలంలో వ్యవసాయం చేస్తూ వచ్చిన అరకొర దిగుబడిని కూడా కనీసం మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయకుండా ప్రభుత్వం వ్యవసాయ రంగం పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని చాటుకుంటున్నారు.దేశంలో రైతే రాజు అన్న నినాదం ఏ మేరకు ఆచరణలోకి వస్తుందో పాలకులు గమనించాలన్నారు. రైతు లేనిదే రాజ్యం లేదు అన్న విషయాన్ని మరోసారి పాలకులు గమనించి, నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందజేసి వ్యవసాయం పట్ల ఉన్న చిత్తశుద్ధిని ప్రభుత్వం చాటుకోవాలని డిమాండ్ చేశారు.అనంతరం సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మండిగిరి శేషప్ప, నాగేష.రంగయ్య, చిన్న ఉచ్చన్న,మంజునాథ్,చంద్రన్న తదితరులు పాల్గొన్నారు.