యంగ్ ఇండియా కే బోల్ పోస్టర్లను విడుదల చేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే
పయనించే సూర్యుడు జనవరి 13
ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్
రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా
ఉట్నూర్ న్యూస్:- దేశవ్యాప్తంగా యువతి యువతను మేలుకొల్పి,పేదల పక్షాన ప్రశ్నించే గొంతుకలనూ తయారు చేయడమే యంగ్ ఇండియా కే బోల్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు సోమవారం ఉట్నూరు మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ నాయకులతో కలసి యంగ్ ఇండియా కే బోల్ సీజన్ - 5 కి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా ఉన్న యువతను పేద ప్రజల పక్షాన పోరాటంలో చేయడంలో భాగంగా యంగ్ ఇండియా కే సీజన్ - 5ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు సమస్యల పరిష్కారంలో యువత ముందు వరుసలో ఉండాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు యంగ్ ఇండియా కే బోల్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలనుకునే యువతి యువకులు గూగుల్ లో లింక్ అందుబాటులో ఉందని అందులో వివరాలను పొందుపరిచే భాగస్వాములు కావచ్చన్నారు గెలుపొందిన వారికి నగదు బహుమతుల ప్రధానం ఉంటుందని తెలిపారు ఇందులో గెలిచిన వారికీ ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమించడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సమరసింహారెడ్డి, జనరల్ సెక్రటరీ అజ్మత్ ఖాన్ ఖానాపూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అరికిళ్ల పరమేశ్వర్ ఎన్ ఎస్ యు ఐ స్టేట్ సెక్రటరీ సోహేల్ షా నిర్మల్ నియోజకవర్గ అధ్యక్షుడు హర్షద్ ఉట్నూర్ మండల అధ్యక్షుడు తిగుట్ల రాజ్ కుమార్ కడెం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ ఇంద్రవెల్లి మండల అధ్యక్షుడు ఇమ్రాన్ జన్నారం మండల అధ్యక్షుడు గణేష్ యూత్ కాంగ్రెస్ నాయకులు భాస్కర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.