పయనించే సూర్యుడు గాంధారి 23/10/25
భార్య తన ప్రియుడుతో కలిసి భర్త హత్య అరెస్ట్ మరియు రిమాండ్ కు తరలిపు స్తానికుల సహాయం ఏర్పాటు చేసిన CCTV కెమరాలే కేసు ఛేదనలో కీలకం జిల్లా ఎస్పి శ్రీ యం రాజేష్ చద్ర ఐపిఎస్ తేదీ 16.10.2025 నాడు పిర్యాదుదారుడు ములకలపల్లి నాగరాజు తండ్రి ముత్తయ్య, వయస్సు 43 సం లు, వృత్తి గాంధారి (గ్రామ పంచాయతీ సెక్రటరీ), నివాసం గాంధారి గ్రామం గారు తేదీ 16.10.2025 నాడు ఉదయం సుమారు 10:30 గంటలకు గాంధారి శివారు చర్మల్ రోడ్డులో తూర్పు రాజు మరియు ఆకుల లక్ష్మణుల వ్యవసాయ భూమి పక్కన, రోడ్డు పక్కన నీరు పోయే ఎండిపోయిన చిన్న కాలువలో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి శవం ఉన్నది అని గుర్తు తెలియని మగ వ్యక్తిని ఎవరో చంపి శవాన్ని అక్కడికి తీసుకువచ్చి చిన్న కాలువలో పడేసి దహనo చేసినారాని ఫిర్యాదు చేయగా గాంధారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించబడింది.ఈ కేసులో కామారెడ్డి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు యెల్లారెడ్డి డిఎస్పి పర్యవేక్షణలో సదాశివ నగర్ సిఐ ఆద్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయబడినది పోలీసుల విచారణలో అనేక అనుమానాస్పద అంశాలు వెలుగులోకి వచ్చాయి తుది విచారణలో తేలింది ఏమనగా కేసు వివరాలు ఇట్టి కేసులో ఇరగడింట్ల నవనీతకు తన మేనత్త కొడుకు అయిన నరేష్ భవాని నగర్ కాలనీ, కీసర మండల్, మెద్చల్ గారితో 2012 సం. లో వివాహం జరిగింది. ఈమే భర్తతో కలిసి కూలి పనులు చేస్తారు అలా కొంత కాలం క్రితం ఇద్దరు కలిసి ఆంజనేయులు (హత్య చేసిన వ్యక్తి) వద్దకు కూలి పనులకు వెళ్లినారు. అక్కడ ఆంజనేయులు నవనీతకు పరిచయం ఏర్పడగా తరువాత ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకునే వారుఇలా పరిచయం కాస్త శారీరక సంబంధం వద్దకు వెళ్ళినది నవనీత భర్తకు ఈ విషయములో అనుమానం వచ్చి అప్పటినుండి నవనీతను వేధించేవాడు. సుమారు ఒక సంవత్సరం క్రితం ముగ్గురు కలిసి రెండు బైక్ లపై పెద్ద గుట్టకు వెళ్లి వచ్చినారు అక్కడ ఇద్దరు క్లోస్ గా సంబంధం కొనసాగిస్తున్నారు అని భర్త నరేష్ కు అనుమానం బలపడి ప్రతీ రోజు ఎక్కువగా టార్చర్ చేశాడు అందువలన నరేష్ ను హత్య చేస్తే ఇద్దరి మద్య అడ్డు తొలిగి పోతుంది అని నవనీత మరియు ఆంజనేయులు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు వారి పథకం ప్రకారం తేదీ 15.10. 2025 నాడు ఆంజనేయులు నవనీతతో ఫోన్లో ఈరోజు నీ భర్తను చంపేస్తాను అని చెప్పి నరేష్ ను రాంపల్లి చౌరస్తా వద్దకు కాల్ చేయించి పిలిచి పెద్దగుట్ట వరకు వెళ్ళి వద్దాము అని చెప్పి అక్కడ అయితే ఎవరూ గుర్తుపట్టరు అని ఉద్దేశంతో పెద్దగుట్టకు వెళ్లి దర్శనం చేసుకొని తిరిగి వస్తూ గాంధారి లో ని వెన్స్ లో మందు తెసుకొని పెద్దగుట్ట నుండి చర్మల్ రోడ్డు పక్కన చిన్న కాలవ వద్ద మద్యం త్రాగించి మత్తులో ఉన్న నరేష్‌ను కిందికి నూకగా తలకు గాయమై స్పృహ కోల్పోయాడు. వెంటనే ఆంజనేయులు రెండు-మూడు సార్లు చేతులతోకాలుతో అతని చాతిపై దాడి చేసి హత్య చేశారు
శవాన్ని ఎవరు గుర్తుపట్టకుండాగాంధారిలో దగ్గరలోని హెచ్‌పీ పెట్రోల్ బంకులో వంద రూపాయల పెట్రోల్ పోసి నిప్పు పెట్టి, తర్వాత పాన్ షాప్‌లో జరుద తెసుకొని మళ్ళీ హెచ్‌పి పెట్రోల్ బంక్ లో 300 రూపాయల పెట్రోల్ బైక్ లో పోసుకొని తిరుగు ప్రయాణం చేశారు ఈ మద్యనే స్తానికుల సహయముతో గాంధారి లో మొత్తం 42 కెమరాలు ఏర్పాటు చేయగా ఇట్టి కేసు విచారణలో CCTV ఫూటేజ్ లు ఇతర సాంకేతిక పరిజ్ఞానం మరియు స్తానికుల సమాచారం నిందితులను గుర్తించడములో ఎంతగానో ఉపయోగపడినవి ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుండి A1 - ఫ్యాషన్ ప్రో బండి మరియు సెల్ ఫోను, A2 -సెల్ ఫోను స్వాధీనపర్చుకొనైనది నిందితుల వివరములు:A1) ఏలూరి ఆంజనేయులు సన్నాఫ్ ముత్యాలు వయసు 38 సంవత్సరాలు, కులము. ఎస్సీ మాదిగవృత్తి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై మరియు శివరాజ్ బోర్డ్ నందు ఔట్సోర్సింగ్ వాటర్ మాన్ గా నాగారం మేడ్చల్ A2) ఇరగడింట్ల నవనీత భర్త నరేశ్ వయసు 27 సంవత్సరాలు, కులము. Waddera వృత్తి లేబర్ నివాసము నగరం భవాని నగర్ కాలనీ, కీసర మండల్ జిల్లా మెడ్చల్ నేరస్తలము నందు ఎలాంటి ఆధారాలు లేకున్నా, మృతుడు ఎవరు అని తెలియని పరిస్తితి నుండి హత్య జరిగిన వారం రోజుల లోపే మర్డర్ చేసిన నిందితులను గుర్తించి కేసును చేదించిన సదాశివనగర్ సీ.ఐ బి. సంతోష్ కుమార్ గాంధారి ఎస్సై ఆంజనేయులు కానిస్టేబుల్ లు సంజయ్ కుమార్ రవికుమార్ సాయిబాబా మరియు ప్రసాదు బంతిలాలు హోం గర్డ్లు లను జిల్లా ఎస్పీ శ్రీ. యం. రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్,9అభినందించారు అదే విధముగా ప్రతీ ఒక్కరూ కూడా CCTV కెమరాల ఏర్పాటులో పోలీసు వారికి సహకరించి ఎక్కువ మొత్తములో ఏర్పాటు చేయవలసినది పరజ్జలకు విజ్ఞప్తి CCTV కెమరాలు నేరాలు నివారించడములో మరియు నేరము చేసిన వారిని గుర్తించడములో ఎంతో కీలకముగ పనిచేస్తాయి అని ఈ కేసు ఒక చక్కటి ఉదాహరణ.