
పయనించే సూర్యుడుD.17.8.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్. భీంగల్ పట్టణంలోని అయ్యప్ప నగర్ ధ్యాన లింగేశ్వర ఆలయంలో శ్రావణమాసం తొలి సోమవారం కావడంతో దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆలయ అర్చకుడు పండార్కర్ అమర్ రావు పంతులు ప్రభాతవేళలో శివలింగాన్ని అందంగా అలంకరించి అభిషేకం చేశారు. తదనంతరం రుద్రాభిషేకం, అఖండ రుద్రార్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టోత్తర పూజలు చేసి భక్తులకు హారతి ఇచ్చారు. భక్తులు శివలింగాన్ని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో గల పుట్టలో ఆవు పాలు పోసి దీర్ఘసుమంగళత్వాన్ని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు అమర్ రావు మాట్లాడుతూ శ్రావణమాసం శివపార్వతులకు అత్యంత ప్రీతికరమైన మాసం. శివలింగానికి బిల్వ పత్రాలను సమర్పించి అభిషేకం చేస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుంది అని అన్నారు. నాగుల పంచమి వేడుకల్లో పట్టణంలోని సుమంగళి మహిళలు, అయ్యప్ప నగర్ కాలనీకి చెందిన శివ భక్తులు తదితరులు పాల్గొన్నారు.