
పయనించే సూర్యుడుD.10.7.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ .బాల్కొండ నియోజకవర్గంలోభీంగల్ పట్టణంలోని 5వ వార్డులో మున్సిపల్ ఆధ్వర్యంలో "ఫ్రైడే డ్రైడే " కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్ల పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, కూలర్లు, డ్రమ్‌లు, కుండీలు, టైర్లు వంటి పాత్రల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టాలని ప్రజలకు అవగాహన కల్పించారు.అలాగే చెత్తను తడి చెత్త, పొడి చెత్త, సానిటరీ చెత్త, మరియు ప్రత్యేక సంరక్షణ చెత్తలుగా వేరుచేసి మున్సిపల్ పారిశుధ్య సిబ్బందికి అందించాలని, పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యానికి పునాది అని వివరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ బోదిరే నాగమణి స్వామి మాట్లాడుతూ, ప్రతి శుక్రవారం "ఫ్రైడే డ్రైడే " కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులను నివారించేందుకు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. చెత్తను 4 రకాలుగా వేరు చేసి ఇవ్వడం ద్వారా వ్యర్థాల నిర్వహణ సులభమై పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో 5 వార్డ్ కౌన్సిలర్ బోదిరే లావణ్య నర్సయ్య మున్సిపల్ కమిషనర్ గజానంద్ మేనేజర్ నరేందర్ మరియు మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొనడం జరిగింది.