పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ పట్టణంలో జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల భీంగల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈనెల 27న వినాయక చవితి సందర్భంగా భీంగల్ పట్టణంలోని ఎస్సై కే సందీప్, సీఐ పొన్నం సత్యనారాయణ ఆధ్వర్యంలో మెరీడియన్ ఫంక్షన్ హాల్ లో పట్టణంతో పాటు అన్ని గ్రామాల గణేష్ మండపాల ఆర్గనైజర్స్ సుమారు 300 మంది తో సమావేశం పెట్టడం జరిగిందని ఎస్ఐ సందీప్ తెలిపారు.ఈ మీటింగ్ లో చేయవలసినవి మరియు చేయకూడనివి వాళ్లకు సూచన చేయడం జరిగింది. అలాగే ఈ మీటింగ్ లో భీంగల్ ఎమ్మార్వో మొహమ్మద్ షబ్బీర్, ఎలక్షన్ డిటి అశ్విన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈ సత్య ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ మేనేజర్ మున్సిపల్ అధికారులు,ఎలక్ట్రిసిటీ అధికారులు సిబ్బంది పట్టణంతో పాటు మండలంలోని సుమారు 350 నుండి 400 విగ్రహాలు పెట్టడం జరుగుతుంది.కావున విగ్రహాలు కూడా ఆన్లైన్ చేయాలి అని సూచించారు.పోలీసు శాఖ సూచనల మేరకు వినాయకుని పెట్టుకునే క్రమంలో తప్పకుండా నిర్వాహకులు ఆన్లైన్ చేసుకోవాలి అని వినాయక విగ్రహ నిర్వాహకులకు సూచించారు.ఈ మీటింగ్ లో విగ్రహాలు ఎక్కడ పెడతారో వాటి ఇన్చార్జి కు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలని అలాగే ఆ విగ్రహాల దగ్గర నైట్ ఎవరైనా ఇద్దరు పడుకోవాలని పవర్ (కరెంట్ )కు సంబంధించింది. ఎలక్ట్రిసిటీ ఏఈ ద్వారా పర్మిషన్ తీసుకొని కరెంటు పెట్టుకోవాలని పవర్ కనెక్షన్ పెట్టేటప్పుడు జాగ్రత్త పాటించాలని ఎట్టి పరిస్థితుల్లో డీజే పెట్టుకోకూడదని క్రాకర్స్ అటువంటివి వినాయక మండపాల దగ్గర గాని వినాయక నిమజ్జనం జరిగేటప్పుడు గానీ పేల్చరాదని వినాయక మండపం దగ్గర మినిమం ఒక సీసీటీవీ పెట్టుకోవాలని వినాయక మండపాల దగ్గర ఏదైనా అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్ అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఒక బకెట్లో ఇసుక మరియు ఒక బకెట్లో వాటర్ పెట్టుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రి 10 దాటిన తర్వాత ఎటువంటి సౌండ్ బాక్స్ లు పెట్టుకొని పాటలు గానీ పెట్టుకోకూడదు వినాయకుని తీసుకొచ్చే క్రమంలో గాని నిమజ్జనం సమయంలో పోయే మార్గంలో గాని ఆ వైర్లు ఎత్తు కిందికి ఉండడం వలన ఆ వైరును పైకి అనే క్రమంలో ఎప్పుడు కూడా ఐరన్ పైపులు వాడరాదని పీవీకి పైపులు వాడాలని వినాయక మండపం రోడ్డుపైన కాకుండా ఏదైనా ఫ్లాట్లో గాని ఏదైనా ఓపెన్ ప్లేస్ లో గాని పెట్టుకోవాలి. ఆ వినాయక మండపం వాహనదారులకు అంతరాయం కలవకుండా ఉండాలి ఆ సౌండ్ బాక్స్ లో భక్తి గీతాలు మాత్రమే పెట్టుకోవాలని. మండపంలో విగ్రహం కింది భాగంలో ఎటువంటి వస్తువులు గాని పెట్టుకోవద్దని వినాయక నిమజ్జనం సమయంలో ఎవరు కూడా మందు, మిగతా మత్తుకు సంబందీoచినవి త్రాగకూడదని భక్తి శ్రద్ధలతో నిమర్జనం చేయాలని ఊరేగింపు సమయంలో వినాయక విగ్రహంతో పాటు ఎక్కువ మంది ఉండేటట్టు చూసుకోవాలి అని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్, సర్వ సమాజ్ కమిటీ,వివిధ శాఖల అధికారులు వివిధ పార్టీల రాజకీయ ప్రజా ప్రతినిధులు, వినాయక మండపాల నిర్వాహకులు యవజన కమిటీ సభ్యులు, పాల్గొన్నారు.