
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ విద్యార్థులకు ఆన్ జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఈరోజు శనివారం నుంచి ప్రారంభించడం జరిగింది. కమిషనర్ ఆదేశం మేరకు ఓజేటి ప్రోగ్రాం ని ఏర్పాటు చేయడం జరిగింది. భీంగల్ కాలేజీలో ఉన్నటువంటి కోర్సులు ఫిషరీస్, ఆఫీస్ అసిస్టెన్షిప్, అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ గ్రూపులకు సంబంధించిన విద్యార్థులు ఓజేటి ప్రోగ్రాం లో పాల్గొనడం జరిగింది. ఈ ఓజేటి నవంబర్ మరియు డిసెంబర్ నెలలో ఉంటుంది ఇది మొత్తం 60 రోజుల ప్రోగ్రాం. ఓజేటి ప్రోగ్రాం లో గ్రూపులకు సంబంధించి పాఠ్యాంశాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి విద్యార్థులు అవగాహన చేసుకుంటారు ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో కళాశాల హిందీ అధ్యాపకుడు సత్యనారాయణ గ్రూపు సంబంధిత అధ్యాపకులు శ్రీనివాస్ ,రామచంద్రం, శోభారాణి, క్రాంతి కృష్ణ ,శ్రీకాంత్ అధ్యాపకులు పాల్గొని విద్యార్థులకు తగు సూచనలు చేయడం జరిగింది.
