PS Telugu News
Epaper

భీంగల్ మండలంలో పర్యటించిన బీజేపీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి..

Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో

భీంగల్ మండలంలోని పురానిపేట్ మరియు బడా భీంగల్ మరియు గోనుగోప్పుల గ్రామాలలో భీంగల్ మండల అధ్యక్షుడు ఆరే రవీందర్ మరియు మండల నాయకులతో కలిసి పర్యటించిన బాల్కొండ నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి అకాల వర్షంతో తీవ్ర నష్టం జరిగిన పంట పొలాలను మరియు కొనుగోలు కేంద్రాలను సందర్శించి నష్ట తీవ్రత గురించి రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు, భీంగల్ మండల తహసీల్దార్ షబ్బీర్ కి ఫోన్లో మాట్లాడి రైతుల దీనస్థితిని వివరించి వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు,ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ గత 20 రోజులుగా బాల్కొండ నియోజకవర్గంలో మరియు భీంగల్ మండలంలో అధికార పార్టీ నాయకులు కొబ్బరికాయలు కొడుతూ కొనుగోలు కేంద్రాలను సొసైటీ ద్వారా మరియు ఐకెపి ద్వారా ప్రారంభిస్తున్నామని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు కానీ ఇప్పటివరకు ఏ ఒక్క కొనుగోలు కేంద్రం నుండి ఒక్క గింజ వడ్ల సేకరణ జరగలేదు రైతులకు మేలు జరగలేదు మీరు 20 రోజులుగా కొబ్బరికాయలు కొట్టడమే పనిగా పెట్టుకున్నారే తప్ప ఆ రోజు నుండి దాన్యం సేకరణ ప్రారంభించి ఉంటే సకాలంలో ధాన్యం సేకరించినట్లయితే మూడు రోజుల క్రితం కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్ద కాకుండా ఉండేది మొలకెత్తకుండా ఉండేది అప్పటికే వడ్లు సేకరించి పది రోజులు అవుతుండే కాబట్టి రైతులకు నష్టం జరగకపోయేది జూబ్లీహిల్స్ ఎన్నికల మీద పెట్టిన దృష్టిలో 10 శాతం మీరు రైతుల మీద పెట్టి ఉంటే రైతులకు నష్టం వాటిల్లకపోతుండే మీరు రైతుల మీద దృష్టి పెట్టకపోవడం వల్ల మీ అజాగ్రత్త వాళ్ళ మాత్రమే ఈ రోజు భీంగల్ మండలంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు, ఇకనైనా అధికార పార్టీ నాయకులు మరియు ఈ ప్రాంత ఎమ్మెల్యే కళ్ళు తెరుచుకొని వెంటనే కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి వడ్ల సేకరణ చేసి తేమ శాతం ఎంత ఉన్న తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేపర్ ప్రకటనలు టీవీలల్ల మాట్లాడుతున్నారు తప్ప కిందిస్థాయిలో రైతుల దగ్గర 12 తేమ శాతం లేకపోతే వడ్లు కొనుగోలు చేయడం లేదు ఈ నిబంధనతోని కూడా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు, కొద్దిగా అటు ఇటు ఉన్నా గాని సేకరించలని మళ్లీ వర్షం వచ్చే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతుంటే మీరు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం సబబు కాదు వెంటనే ఎటువంటి కడ్తలు కటింగ్ లేకుండా ధాన్యం సేకరణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమాలలో మాజీ మండల అధ్యక్షు డు మొలిగే మహిపాల్, మండల ప్రధాన కార్యదర్శి బిర్రు రామకృష్ణ, ఉపాధ్యక్షులు కిషన్, మహేందర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షు డు తోట గంగాధర్, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నరసయ్య,ఓ బి సి మోర్చా జిల్లా ఉపాధ్యాయులు లక్ష్మణ్ గౌడ్,యువమోర్చా మండల అధ్యక్షులు శెట్టి ప్రేమ్చంద్,మైనార్టీ మోర్చా మండల అధ్యక్షులు హకీం, సీనియర్ నాయకులు సంధ్యారాజ్ కొట్టాల మోహన్ కొట్టాల అశోక్, మచ్చ గంగాధర్, గోన్ గొప్పల లక్ష్మీనారాయణ రంజిత్,గంగాధర్ పాల్గొన్నారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top