
పయనించే సూర్యుడుD.20.7.2026 నిజామాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ టి కే గంగాధర్.. బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండలంలోభీమ్గల్ మండల అధ్యక్షుడు ఆరే రవీందర్ భీమ్గల్, తేదీ:20,సోమవారం.ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో, ఎమ్మెల్యే తన నివాసంలోనే ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయించడం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్య అని భీమ్గల్ మండల బీజేపీ అధ్యక్షుడు ఆరే రవీందర్ తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన సవాళ్లపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, ఎలాంటి తప్పు చేయని బీజేపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని పోలీసులను ఉపయోగించి ముందస్తు అరెస్టులు చేయించడం రాజకీయ కక్షసాధింపునకు నిదర్శనమని విమర్శించారు.భీమ్గల్ మండల బీజేపీ అధ్యక్షుడు ఆరే రవీందర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యోగేశ్వర నర్సయ్య, భీమ్గల్ టౌన్ అధ్యక్షులు కనికరం మధు,విశ్వ హిందూ పరిషత్ నాయకులు రజనీకాంత్ ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో ఉంచడం అత్యంత ఖండనీయమని అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ, ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందని, ఆ హక్కును పోలీసుల ద్వారా అణచివేయాలని చూడడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.రాజకీయ ప్రత్యర్థులను పోలీసుల ద్వారా భయపెట్టాలని ప్రయత్నించడం వల్ల బీజేపీ నాయకులు వెనక్కి తగ్గరని, ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఆరే రవీందర్ స్పష్టం చేశారు.తెలంగాణ ప్రభుత్వం వెంటనే రాజకీయ కక్షసాధింపు చర్యలను విరమించుకుని, ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని, పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.