పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీమ్గల్ పట్టణములో
ఈరోజు గురువారం రోజున మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ మండల పరిషత్ కార్యాలయంలో భీమ్గల్ మండలంలో అధిక వర్షపాతం మూలంగా ఇసుక మేటలు వేసిన భూములలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టవలసిన పనుల గురించి మండల అగ్రికల్చర్ అధికారి మరియు ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించినారు ఈ సమీక్షలో క్రింది అంశాలు చర్చించినారు మండలంలో 124 మంది రైతుల భూములలో సుమారు 85 ఎకరాలలో ఇసుక మెటల్ వేసినాయని అగ్రికల్చర్ అధికారుల యొక్క నివేదిక ఆధారంగా ఉపాధి హామీ పథకంలో వెంటనే అంచనాలు తయారు చేసి పనులు ప్రారంభించాలని తెలిపినారు అగ్రికల్చర్ అధికారులు మరియు ఉపాధి హామీ సిబ్బంది ఉమ్మడి సర్వే చేసి వాస్తవస్థితిగతులను నివేదిక ఇవ్వాలని తెలియజేయడం జరిగింది
రైతుల నుండి వారి అంగీకారం తీసుకొని పనులు ప్రారంభించాలని మరియు వ్యవసాయ శాఖ సమన్వయంతో పనులు చేపట్టాలని తెలిపినారు
ఈ సమావేశంలో అగ్రికల్చర్ అధికారి లావణ్య మరియు ఉపాధి హామీ ఏపీవో జీ నర్సయ్య ఇంజనీరింగ్ కన్సల్టెంట్ పూర్ణచంద్ మరియు ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు ఉన్నారు