పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 19 బాల్కొండ ప్రతినిధి లింబాద్రి తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
భీంగల్ పట్టణంలో శనివారం రోజున సర్వ సమాజ్ కమిటీ ఎన్. ఎస్. కే. స్టీల్ & సిమెంట్స్ హార్డ్వేర్ షాప్ లో కొత్త సీసీ కెమెరాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.షాప్ యజమాని కుమ్మరి నర్సయ్య మరియు కుమ్మరి హరీష్ లతో మాట్లాడి సర్వసమస్ కమిటీ అధ్యక్షుడు నీలం రవి భీంగల్ పట్టణ భద్రత దృష్ట్యా సీసీ కెమెరా రోడ్డుపై వెళ్లే వాహనాలు కనిపించే విధంగా పెట్టించడం జరిగింది. అదేవిధంగా భీంగల్ లోని పలు దుకాణంలో కూడా సీసీ కెమెరాలు రోడ్డు కనిపించే విధంగా పెట్టిస్తామని సర్వసమస్ కమిటీ అధ్యక్షుడు మరియు సలా కమిటీ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బర్ల మోహన్, క్యాషియర్ కాపు కుమారి హరీష్, సలహా కమిటీ సభ్యులు దయ్య ప్రవీణ్, మల్లెల ప్రమోద్, తోపారం సురేందర్, తిరుపతి పాల్గొన్నారు.